సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై.. గోదావరి జిల్లాల్లో పందెపురాయళ్ళు పందాలకు తెగబడుతున్నారు. ఎన్నికలు అంటేనే పందాలరాయుళ్లకు పెద్ద పండుగ. సర్వేలు ఆధారంగా పందెం రాయుళ్లు వారి ట్రెండ్ ను మారుస్తున్నారు. ఆన్లైన్ వేదికగా పందాలు జోరుగా సాగుతున్నాయి.
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్లో చేసిన హల్చల్తో చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెదవేగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమతో పాటు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తీసుకెళ్లారు.
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు.