ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమికి వస్తాయని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అమరావతిలోనే తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువనేశ్వరి డిసైడ్ చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రబాబు ఆత్మ కథలో నాకో పేజీ ఉంటుంది.
పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణలలో దాడులకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్న పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. సిట్ టీమ్ దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొనింది. సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకు షరతు విధించింది.
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు.
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులకు కొంతమంది పోలీసుల ఫెయిల్యూరే కారణమని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముందస్తుగా హెచ్చరించి దాడులకు దిగినా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు.
పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు ( కృష్ణబాబు ) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కృష్ణబాబు.. మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దొమ్మేరుకు తీసుకు వెళ్లనున్నట్లు బంధువులు ప్రకటించారు.