Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయలు చొప్పున వంగా గీత తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారు? అని నిలదీశారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. సుమారు 30 మంది దగ్గర పది నుంచి 15 లక్షల రూపాయల వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కలెక్ట్ చేశారని పేర్కొన్నారు. అయితే, మా (టీడీపీ-జనసేన-బీజేపీ) ప్రభుత్వం వచ్చిన వెంటనే.. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణ చేయిస్తామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. దీంతో.. ఎన్నికల ఫలితాలకు ముందే.. పిఠాపురంలో పొలిటికల్ హీట్ పెరిగినట్టు అయ్యింది.. ఎన్నికల ప్రచార సమయంలో.. విమర్శలు, ఆరోపణల పర్వం జోరుగా సాగగా.. ఫలితాలకు ముందు.. వంగా గీతపై వర్మ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చగా మారాయి.
Read Also: Bribe: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అవినీతి తిమింగలాలు