CM Chandrababu: నా జీవితంలో ఇలాంటి విజయాన్ని చూడలేదు: సీఎం చంద్రబాబు
- శాసనసభలో సీఎం చంద్రబాబు
- 93 శాతం స్టైక్ రేట్‌తో గెలవడం చరిత్ర
- తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్టైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నం.1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
బడ్జెట్‌పై శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. 2014లో లోటు కరెంట్ ఉండేది. పలు విధానాలు తీసుకొచ్చి… ఇప్పుడు మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ మేం విజయం సాధించి ఉంటే.. 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వం జీవోలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టలేదు. విభజన నష్టం కంటే.. గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
Also Read: Top Headlines @1PM : టాప్ న్యూస్!
‘గత ప్రభుత్వం అన్ని వ్యవస్ధలను నాశనం చేసింది. గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. అస్తవ్యస్థ ఆర్ధిక నిర్వహణలో రాష్ట్ర పరిస్ధితి వెనక్కి పోయింది. ఏపీ జీవనాడి పోలవరం పనులు పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కరువనేది రాదు. విద్యుత్ బకాయిలు పెట్టి ఓపెన్ మార్కెట్లో విద్యుత్ కొనాలని చూశారు. 1.29లక్షల కోట్ల నష్టంలోకి విద్యుత్ శాఖను నెట్టేశారు. గత ప్రభుత్వంలో మద్యం షాపుల్లో ఎక్కడా ఆన్ లైన్ పేమెంట్లు లేవు. భూములు లాక్కోవడానికి 22a తీసుకొచ్చారు. సంపద సృష్టించే ప్రాజెక్టులు ఆపేసారు, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పాను. ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం’ అని సీఎం చెప్పుకొచ్చారు.
- Tags
- ap
- CM Chandrababu Naidu
- tdp
- tdp win
- ycp
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!