Margani Bharat: వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మళ్లీ బాబు బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. ఎస్జీ ఎస్టీపై ఒక శాతం సర్ ఛార్జ్ విధించుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించడం అంటే ఇదేనా.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలోనే ఆయన నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. 2014- 19 పాలనకు మించి బాదుడే బాదుడు కార్యక్రమానికి పదును పెట్టారని సెటైర్ వేశారు. ఇప్పటికే కరెంట్ చార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచారని మార్గాని భరత్ పేర్కొన్నారు.
Read Also: Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..
అలాగే, ప్రజలు ఏం కొన్నా 1 శాతం అదనపు ట్యాక్స్ కట్టాలి అని మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. అసలు సర్ ఛార్జ్ విధింపు ఎందుకోసం? ఎవరి కోసం? అని ప్రశ్నించారు. మీరు ఎన్నికల్లో ఏం చెప్పారు? నేను సంపద సృష్టిస్తా అన్నారా? లేదా? మరి ఆ సంపద ఎక్కడుంది?.. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా?.. అసలు సర్ ఛార్జ్ రూపంలో వచ్చే డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలని అనుకుంటున్నారు? అని అడిగారు. మీరు తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయి?.. రూ.57 వేల కోట్లు ఏం చేశారు?.. ఎవరి జేబుల్లోకి ఆ డబ్బు వెళ్లింది? మీ ఐదారు నెలల పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క స్కీం లేదని వైసీపీ మాజీ ఎంపీ భరత్ విమర్శించారు.
Read Also: Pushpa 2 The Rule: రేయ్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు.. గన్నులతో వెల్కమ్ ఏంటి?
ఇక, ఒక్క పనీ లేదు.. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ డ్.. రాష్ట్ర ప్రజలపై ఇప్పటికే రూ. 25 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. మీరు చెప్పింది అబద్దం కాదా?.. మీరు అడుగుతున్న సర్ ఛార్జ్ ని ఎవరి కోసం వాడాలనుకుంటున్నారు? అని అడిగారు. ప్రజలు చెల్లించే ప్రతి రూపాయి పైనా ఇది భారం అవుతుంది.. ప్రజలు భరించే డబ్బులు ఎవరి కోసం వాడాలనుకుంటున్నారు? అని క్వశ్చన్ చేశారు.