నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరవు నివారించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం మొదటి ప్రాధాన్యత పోలవరం అని, రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అని తెలిపారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి.. 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి.. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి నిమ్మల వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానాలు ఇచ్చారు. ‘రాష్ట్రంలో కరవు నివారించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం. సీఎం మొదటి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టు, రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. గత ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రెండు దశల్లో రూ.17,050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి.. రూ.5 పని కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. రూ.1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చాం’ అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
Also Read: Mudragada Letter: సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. మీకు తగునా అంటూ..!
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం 63.20 టీఎంసీల నీటిని తరలించాలి. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి త్రాగునీరు అందించడానికే ఈ ప్రాజెక్టు. 2009లో 7,214 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 2, శారద నదిపై ప్రాజెక్టులు అంశం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. వచ్చే నెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటాం’ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు.