ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.. పుంగనూరు అల్లర్ల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హై కోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. అయితే, ఈ రెండు కేసుల్లో ఎంపీ మిథున్ రెడ్డితో సహా ఐదుగురికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఏపీ హైకోర్టు.
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆందోల్ నియోజకవర్గంలో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఫోట్ను షేర్ చేసుకున్నారు.
నా పేరు చెప్పి కబ్జాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. తన పేరు చెప్పి కొందరు భూ కబ్జాలు చేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం..
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైసీపీ సర్కార్ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.. 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సాధారణ పరిపాల శాఖ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు.
వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికుండగానే జగన్, షర్మిలకు సమానంగా ఆస్తి పంపకాలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. జగన్‌కు బెంగుళూరులో ఇల్లు ఉందని షర్మిలకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు ఇచ్చారని వెల్లడించారు. వివాహం అయినా తర్వాత షర్మిల వాటాలు తీసుకొని మళ్ళీ ఆస్తులు కోరడం సమంజసం కాదన్నారు.
తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం.. నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి అన్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
టీడీపీ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ ప్రారంభం అయ్యింది.. తొలి సభ్యత్వాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకోవడంతో.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అయితే, రూ.100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా సభ్యత్వ కార్యక్రమాన్ని రూపొందించింది తెలుగు దేశం పార్టీ.