రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితా విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంఛార్జ్ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు
పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను ప్రభుత్వం గాడిలో పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే అని, నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారని…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల అని పేర్కొన్నార ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..తాము అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బతికి ఉంటే... జైలుకు పంపుతామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గొట్టిపాటి రవి మండిపడ్డారు..
మంత్రి సవిత.. హిందూపురం ఎంపీ పార్థసారథి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చారు హిందూపురం ఎంపీ పార్థసారథి.. కార్యకర్తల్ని విస్మరిస్తే, వారిని కాపాడలేక పోతే నాయకులకు భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.. కానీ, మంత్రి సవితకు నాకు ఎటువంటి గొడవలు లేవు, కలిసే పని చేస్తాం అంటూ ఎంపీ పార్థసారథి వారి ఇరువురి మధ్య ఉన్న వైరానికి తెరదించారు.
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రభుత్వం ఎన్ని సిట్లు ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే టీటీడీ లడ్డుపై సిట్, గంజాయిపై ఈగల్, ఇప్పుడు రైస్‌పై సిట్.. ఇవన్నీ ప్రచారం కోసం తప్ప ఏం లేదన్నారు.
అధికారంలో ఉన్నపుడు.. ఇప్పుడు వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. గత ప్రభుత్వం వసతి దీవెన పథకానికి కేటాయించిన నిధులు 50 శాతానికి మించి ఎప్పుడైనా ఖర్చు చేశారా? అని ప్రశ్నించారు. దానికి రికార్డులు కావాలన్నా ఇస్తామన్నారు..
టీడీపీలో మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్‌పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా…
మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.