CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..
- మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్..
- కేవలం పనులు వేగవంతం కోసమే ర్యాంకులన్న సీఎం చంద్రబాబు..
- ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడం కోసం కాదు..
- పైస్థాయి నుంచి చిరుద్యోగి వరకు పనిపై దృష్టి పెడితేనే ఫలితాలు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని ఆయన తెలిపారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు లాంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Flight Missing: అమెరికాలో విమానం మిస్సింగ్.. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే..
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
అయితే, ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను నమ్ముతాను.. అసాధారణ, వేగవంతమైన పని తీరు చూపితే తప్ప.. విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం అన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పని తీరుపై సమీక్షించుకుని పని చేయాలన్నదే మా ఆలోచన అని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం.. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!
ఇక, ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పని చేయడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది.. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది.. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పని చేస్తున్నాం.. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాం.. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పని చేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి.. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నాం.… pic.twitter.com/sRpCrO9Xdy
— N Chandrababu Naidu (@ncbn) February 7, 2025
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!