ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి అమరావతికి వెళ్లనున్నారు. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైళ్ల క్లియరెన్స్‌లో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అగ్రస్థానంలో ఉండగా.. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరో స్థానంలో ఉండగా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఎనిమిదో స్థానంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు.