CM Chandrababu: అడవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అడవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. శైవ క్షేత్రాలు ఎక్కువగా అడవీ ప్రాంత పరిధిలోనే ఉన్నాయి.. అడవీ మార్గం ద్వారా ఆ దేవాలయాలకు వెళ్లే భక్తులను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడానికి వీలులేదని.. అందుకు తగ్గట్టుగా తక్షణమే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కాలుష్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చి దిద్దేందుకు తగిన స్థాయిలో గ్రీనరీని పెంచాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: YSR Congress Party: మాజీ సీఎం హోదాలో వైఎస్ జగన్ భద్రతపై అనుమానాలున్నాయి..
ఇక, రాష్ట్రంలోని పలు నగరాలను, పట్టణాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దే విషయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తగిన చర్యలు చేపట్టాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అటవీ ప్రాంతాల్లో కాంటూర్ ట్రెంచెలను పెద్ద ఎత్తున నిర్మించేందుకు ఎన్ ఆర్ జీఎస్ నిధులను వినియోగించుకోవాలి అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఏనుగుల బెడదను నివారించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి ఏనుగులను తీసుకొచ్చేందుకు ప్రత్యేకత చొరవ చూపుతున్నారన్నారు. ఆ ప్రక్రియను వేగవంతం చేసే అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.