నాడు మద్యపాన నిషేదమన్న జగన్.. ఇప్పుడు టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మిస్తున్నారంటూ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నా.. జగన్ మాత్రం నేను సీఎంను కాదు, నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లే కాలకేయుల్లా.. మారి మహిళలపై అత్యాచారాలు, దాడులకు తెగబడుతున్నారి ఆమె మండిపడ్డారు. వైసీపీ 3 ఏళ్ల పాలనపై కేకులు కట్ చేస్తున్న వైసీపీ…
మరోసారి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎక్కడకు పోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోందని, జగన్ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునక అంటూ ఆమె మండిపడ్డారు. అధికారదాహాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారని, సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి, మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు, రేపు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా? అని ఆమె ప్రశ్నించారు. 65 మందిని…