చంద్రబాబు కు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ అన్నారు. అందుకే ఇవాళ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. 14 ఏళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 144 సంవత్సరాల్లో సోమశిల కు ఈ స్థాయి వరద రాలేదు. అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే క్యపాసిటీ 2 లక్షల 17 వేల క్యూసెక్కులు… కానీ ఆ రోజు ఉదయం 3 లక్షల 20 వేల క్యూసెక్కులు నీరు వచ్చింది. అది కూడా రెండు, మూడు గంటల వ్యవధిలో వచ్చింది. చంద్రబాబు హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కు ఎందుకు రిపేర్లు చేయలేదు. అప్పుడు గాడిదలు కాస్తున్నారు అని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబు తన పీసీ లో వరద గురించి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చినంత వరకే చెప్పి ఎందుకు మిగిలిన విషయాన్ని దాచారు… సీడబ్ల్యూసీ సమాచారం ఎక్కడ ఇచ్చింది. కేంద్ర మంత్రి ఏం చెబితే అదే నిజమవుతుందా… అయితే గతంలో నరేంద్ర మోడీ చంద్రబాబు అవినీతిపరుడు అన్నారు. ఈ ఆరోపణ కరెక్ట్ అని చంద్రబాబు ఒప్పుకుంటున్నాడా అని అడిగారు. ఉత్తరాఖండ్ లో వారదకు ప్రాజెక్టు కొట్టుకుపోయింది… అది కూడా బీజం ప్రభుత్వ వైఫల్యమా. గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలు బాధాకరం. షెకావత్ వెనుక టీడీపీ బీజేపీ నేతలు ఉన్నారని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. షెకావత్ అన్నమయ్య ప్రాజెక్టు సామర్థ్యం కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ వరద వచ్చిందని చెప్పారు. ఒక గేటు ఎత్తలేకపోయినంత మాత్రాన అంత నీరు ఎలా వెళుతుంది. ఒక్క గేటుకు సామర్థ్యం ఎంత ఉంటుంది అని అన్నారు.