Off The Record: కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ.. అధిష్ఠానం మల్లగుల్లాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం. లింగారెడ్డి ఉన్నారు. వచ్చే మార్చి నాటికి ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతుంది. 2024లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్టీ జిల్లా పగ్గాలు మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందట. అయితే ఎవరిని ఆ హాట్ సీటులో కూర్చోబెట్టాలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జుల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన సమయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్టు సమాచారం. కడప జిల్లా టీడీపీ చీఫ్ అయ్యేందుకు పలువురు నాయకులు బలంగా లాబీయింగ్ చేస్తున్నారట. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న ఆర్. శ్రీనివాసులరెడ్డి కడప జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తితో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయనే కడప ఎంపీగా పోటీ చేస్తారని అనుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో శ్రీనివాసుల రెడ్డే చక్రం తిప్పారు. 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లా అధ్యక్షులు వచ్చారు. ఆ విధంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు లింగారెడ్డి చేతికి వచ్చాయి. అయితే పార్టీకి లింగారెడ్డి ఏమీ చేయలేదని స్వపక్షంలోని ఆయన వైరివర్గం విమర్శ. ఆర్. శ్రీనివాసులరెడ్డి ఆసక్తితో ఉన్నా.. ఆయన పేరును ఎందుకు ఖరారు చేయడం లేదన్నది తెలుగు తమ్ముళ్ల ప్రశ్న.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్‌పై గెలిచినా ఆ ఎమ్మెల్యే ప్రాధాన్యం లేదా? ఆయన వర్గంలో అసంతృప్తి
Also Read
పార్టీ పదవి కోసం ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా పోటీ పడుతున్నారట. ప్రస్తుతం పులివెందుల అసెంబ్లీ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు బీటెక్ రవి. గతంలోనూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేస్‌లో రవి పేరు వినిపించింది. ఏ కారణాలవల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు బీటెక్ రవి పేరు మరోసారి చర్చల్లో నలుగుతోంది. ఇటీవల పులివెందుల ఇంఛార్జ్ హోదాలో టీడీపీ పెద్దలతో రవి భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే తనకు జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పులివెందుల టికెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని.. జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే చాలని రవి చెప్పారట. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను తనకు అనుకూలంగా వర్గాలను తయారు చేసుకుని బీటెక్ రవి అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్. శ్రీనివాసులరెడ్డికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు, కేడర్ రవితో టచ్‌లోకి వెళ్తోందట. ఈ క్రమంలో పోటాపోటీగా పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నాయట. ప్రస్తుతం ఈ విషయంలో వాసు, రవి ప్రయత్నాలు టీడీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అయితే పార్టీ పదవుల విషయంలో ఈ స్థాయిలో నాయకులు తెరవెనుక వేస్తున్న ఎత్తుగడలే తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తున్నాయట. మరి.. అధిష్ఠానం ఈ ఇద్దరిలో ఒకరికి పట్టం కడుతుందో లేక కొత్త వారిని ఎంపిక చేస్తుందో కాలమే చెప్పాలి.
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!