YS Jagan: వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Off The Record: ఏం…. నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇవ్వరు గవర్నర్ పదవి? గౌరవంగా రిటైర్ అవుదామని నాకు మాత్రం ఉండదా? నాకు మాత్రం మనసు లేదా? దానికి మనోభావాలు ఉండవా? అవి హర్ట్ అవవా అని అంటున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? పార్టీ అధిష్టానం ఆయన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అశోక్‌గజపతికి పదవి వచ్చాక ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోందన్నది నిజమేనా? ఎవరా టీడీపీ సీనియర్? ఎంటా వ్యథ? యనమల రామకృష్ణుడు.. టిడిపి…
టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
బెజవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని దుర్గగుడికి ర్యాలీగా వెళ్లి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన చేయగా.. మైనార్టీలకు ఈ టికెట్ ఇవ్వక పోతే ఉరి వేసుకుంటారో, ఇంకా ఏం చేస్తారో తెలియదని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వార్నింగ్ ఇస్తున్నారు.
Off The Record: ఆధిపత్య రాజకీయాలకు పురిటిగడ్డ అనకాపల్లి. ఒకప్పుడు కొణతాల, దాడి కుటుంబాల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు నడిచేది. బలమైన గవర సామాజిక వర్గం డామినేషన్ కనిపించేది. 2009లో తొలిసారి ఆ రాజకీయానికి బ్రేకులు పడ్డాయి. స్ధానికేతర నాయకుల ఎంట్రీతో కుటుంబ రాజకీయాలు చెల్లిపోయాయి. పునర్విభజన తర్వాత కీలకమైన మునగపాక మండలం యలమంచిలిలో విలీనం అయింది. సరిగ్గా ఇక్కడి నుంచే అనకాపల్లి రాజకీయ ప్రయోగాలకు వేదికగా మారింది. అనకాపల్లి మున్సిపాలిటీ, మండలం, కశింకోట మండలం…
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్…