అక్కడ టీడీపీకి అభిమానులు.. కార్యకర్తలు బాగానే ఉన్నారు. పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అధినేతకు కూడా అంతు చిక్కడంలేదా .. లేక యథావిధిగా నానబెడుతున్నారా? నాయకుడు లేని పార్టీలో ఏం చెయ్యాలో కేడర్‌కు కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? శివరామ్‌కు బాధ్యతలు అప్పగింతపై బాబు డైలమా? గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత నియోజకవర్గంలోని…
విపక్షంలో ఉన్న పార్టీ పుంజుకోవాలంటే నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. కానీ, బెజవాడ టిడిపిలో ఇది రివర్స్ లో ఉందట.. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మొదలైన కలహాలు ఇంకా కొనసాగుతున్నాయట.. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్నారట. నేతల మధ్య పోరుతో కేడర్ అయోమయంలో పడుతోందట.. బెజవాడ టిడిపిలో కలహాల కాపురం సాగుతోంది. నేతల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన కలహాలు కార్పొరేషన్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న…
గరం గరం పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన గన్నవరంలో టీడీపీ కేడర్‌కు కష్టమొచ్చిందట. అక్కడ పార్టీ ఇంఛార్జ్ ఉన్నా.. కేడర్‌కు లీడర్ కొరత మాత్రం తీరలేదని టాక్. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని చర్చ జరుగుతోంది. ఈక్వేషన్లు కుదరడం లేదట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడు ఏపీలోని టీడీపీ కంచుకోట నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 వైసీపీ గాలిలోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. కృష్ణా జిల్లాలో రెండుచోట్ల టీడీపీ గెలవగా..…