అసలే ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి చోట కలిసి పోరాడాల్సిన టీడీపీలో మూడు ముక్కలాట సాగుతోంది. సమీక్షలు పెట్టి క్లాస్‌లు తీసుకున్నా.. నేతల తీరు మారడం లేదట. గందరగోళంలో పడిన కేడర్ దిక్కులు చూస్తోందట. ఫ్లెక్సీలు చించేయడంతో టీడీపీలో కలకలంప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గడిచిన రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు బూదాల అజితారావు. మొదటిసారి ఓడినప్పుడు ఏ విధంగా అయితే కేడర్‌కు కనిపించకుండా పోయారో.. రెండోసారీ నియోజకవర్గంలో అజితారావు అదే చేశారని…
టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్‌చార్జ్‌లు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనన్నారు. పనిచేయలేని ఇన్‌చార్జ్‌లు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండని చెప్పారు. పని చేయని ఇన్‌చార్జ్‌లు…
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా భావించిన ఆ నియోజకవర్గంలో 2 దశాబ్దాలుగా పార్టీ గెలుపు రుచి చూడలేదు. పల్నాడు రాజకీయాలకు కేంద్రమైనా టీడీపీ నెగ్గుకు రాలేని పరిస్థితి. అందుకే స్థానిక తెలుగు తమ్ముళ్లు కొత్త పాట పాడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. వరస ఓటములతో నరసరావుపేటను విడిచిపెట్టిన కోడెల ఫ్యామిలీ..! గుంటూరు జిల్లా నరసరావుపేట.. పల్నాడు పౌరుషాలకు రాజకీయ వేదిక. టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 వరకు టీడీపీదే ఇక్కడ ఆధిపత్యం. వరసగా అనేక పర్యాయాలు కోడెల…
కుప్పం పురపోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. కుపుం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో దొంగ ఓట్లు వేశారని వైసీపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి స్పందిస్తూ..కుప్పంలో దొంగ ఓట్లు అని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇంత వరకు…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను మహాత్మా గాంధీ, సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్‌లతో పోల్చారు, వారందరూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని అన్నారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ (మహమ్మద్ అలీ) జిన్నా ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నారు. వారు న్యాయవాదులుగా మారి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సిద్ధాంతంపై…
అధికారం కోల్పోయాక ఏ ఒక్క నేతా ఆ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదట. ఉన్న కొందరూ నచ్చిన దారిని ఎంచుకున్నారు. పార్టీనే నమ్ముకున్నవారి పరిస్థితి ఏంటన్నది టీడీపీ తమ్ముళ్ల ఆవేదన. ప్రస్తుతం దిక్కులేకుండా పోయామని వాపోతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? దిక్కులేకుండా పోయామని చిత్తూరు తమ్ముళ్ల ఆవేదన! అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ స్థితి దయనీయంగా ఉందన్నది కేడర్ ఆవేదన. జిల్లా కేంద్రమైన…
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు తమ్ముళ్ల కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? పార్టీ అధికారంలో లేకపోయినా వెనక్కి తగ్గడం లేదా? ఇప్పట్లో ఆ తగువులు కొలిక్కి వస్తాయో లేదో కూడా తెలియదా? పార్టీ పెద్దలు కూడా తలపట్టుకుంటున్నారా? ఇంతకీ ఆ నియోజకవర్గమేంటీ? తమ్ముళ్లు ఎందుకు కీచులాడుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. కొవ్వూరు టీడీపీలో కుమ్ములాటలు! పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు. టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా.. ఎవరి గ్రూప్ వాళ్లదే. పార్టీ వేదికలపైనే కాదు.. సోషల్…
వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్‌లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం. రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ! అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే…
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు! ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల…
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్‌ప్లాన్‌కు ఇంకెవరు చిత్తవుతున్నారు? తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ! గ్రౌండ్లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ…