ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ సీనియర్ నాయకుడు వంగవీటి రాధ, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు.
పాణ్యం నియోజకవర్గం మొత్తం పసుపుయంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితరెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీగా వచ్చి కదం తొక్కారు.
ఉదయగిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. అతిరథ మహారధులు వెంట నడువగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా.. అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల