గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం- బీజేపీ- జనసేన కార్యకర్తల సమావేశంలో 25వ తేదీన నామినేషన్ వేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నారు. ఏదురు పార్టీ వాళ్లు కూడా అదే రోజు నామినేషన్ వేయాలని నిర్ణయించారు.. అందువల్ల ఒకే రోజు రెండు పార్టీలకి అనుమతి ఇవ్వను అని ఆర్వో చెప్పారు.. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని డీఎస్పీ జై సూర్య తెలిపారు.. పార్టీలో సీనియర్ నాయకులు వెనక్కి తగ్గి తేదీ మార్చుకుందామంటున్నారు.. ఇక, కుర్రాళ్ళు తెలుగు యువత అదే డేట్ ఉంచుదామని అంటున్నారని యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు.
Read Also: CM YS Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మా వైఖరి ఇదే.. స్పష్టం చేసిన సీఎం జగన్
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ లాగా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మాకు తెలుసు అని గన్నవరం టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. మాకు గన్నవరం నెగ్గడం ఇంపార్టెంట్.. గన్నవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా గొడవలకి దూరంగా ఉంచుదామని నిర్ణయించుకున్నాం.. అందుకే, నా నామినేషన్ ఈ నెల 24వ తేదీన వేస్తున్నట్లు యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.