కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి సపోర్టుగా షాకింగ్ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈసారి రాబోయే ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఓటమికి తప్పదన్న ఆ సర్వే రిపోర్ట్ లో వెల్లడైందని పుత్తా ఫ్యామిలీ తెలిపింది.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆవిష్కరించారు.
మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్‌ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా విక్రయించిన రైతులకు.. నెలలు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. రైతులకు పెండింగ్‌లో ఉన్న ధాన్యం డబ్బును వెంటనే విడుదల చేయటంత�