ఏపీలో హాట్ టాపిక్ గా మారిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలు చాలా సీరియస్ గా వున్నారు. గుడివాడ కేసినో పై చంద్రబాబుకి నివేదిక అందచేశారు. గుడివాడలో కేసినో నిర్వహణపై రూపొందించి సమగ్ర నివేదికను గవర్నరుకి అందచేస్తాం. గవర్నర్ రేపు, ఎల్లుండిలో సమయమిస్తే ఆయనకు క్యాసినో నిర్వహణపై అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేస్తాం అన్నారు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర.
క్యాసినో జరిగింది వాస్తవం, పోలీసులు దర్యాప్తు చేసేందుకు ఎందుకో విముఖంగా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఈడీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్కమ్ టాక్స్ శాఖలు సమగ్ర దర్యాప్తు చేయాలి.కొడాలి నానికి బేడీలు తప్పవు.నిజాల్ని కప్పిపుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారు.జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు, కొడాలి నాని ఆయన తండ్రి ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయాలి.
వర్ల రామయ్యతో ఎందుకు పెట్టుకున్నావ్ అని కొడాలి నాని తండ్రి ఆత్మ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది.వర్ల రామయ్య పోలీసు అధికారిగా కొడాలినాని ని ఎన్నిసార్లు కొట్టారు, ఏఏ కేసులు పెట్టానో నేను ఇప్పుడు చెప్పను. మహిళల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసిన సిగ్గులేని మంత్రి కొడాలి నాని అని వారు మండిపడ్డారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలం, జాతీయ స్థాయిలో పోరాడతాం అన్నారు టీడీపీ నేతలు. రాష్ట్రం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో పాలన ఉందన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజా.