టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు వైఎస్సార్‌సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్), ధనమ్మ (మాజీ ఎంపీపీ) చేరారు. ఈ సందర్భంగా భరత్‌కుమార్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్), మలశాల కుమార్ రాజా (విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.
Read Also: S. Jaishankar: అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమే.. చైనా కొత్త మ్యాప్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇక, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్ తలే రాజేష్ ఉన్నారు. పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీలో రెండు సార్లు గెలుపొందిన తలే భద్రయ్య (1985, 1994), ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఆరేళ్ళ పాటు భద్రయ్య పని చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.
Read Also: Varalaxmi Sarathkumar: డ్రగ్స్ కేసులో నోటీసులు.. చాలా బాధగా ఉందంటూ వరలక్ష్మీ ట్వీట్