Ambati Rambabu: నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. Green Hydrogen Valley: గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్ విడుదల.. 50 స్టార్టప్‌లకు ప్రోత్సాహం.! మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు…
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమన్నారు.
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కేసులో నిందితుడు సతీష్ కుటుంబ బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరికి సతీష్ పై పెట్టిన కేసు ఒక తార్కాణమని ఎద్దేవా చేశారు. పేద వడ్డెర కులస్తుడైన సతీష్ పై అక్రమ కేసు బనాయించి అతని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారన్నారు.
Shyamala: వైస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారని.. చేతగానప్పుడు, చేయలేనప్పుడు వాగ్ధానాలు చేయకూడదని ఆవిడ పేర్కొంది. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారని, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చని ఆమె మాట్లాడారు.…
RK Roja: నగరిలో జరిగిన దళితుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఆమె. దళితులను ఊర్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలివేయాలని హుకుం జారీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు దళితులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? అంటూ రోజా ప్రశ్నించారు.…
ఏపీలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్దిదార్లకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు ఎంపీ మార్గాని భరత్. వన్ టైం సెటిల్మెంట్ పథకం ఒక చక్కని కార్యక్రమం అన్నారు భరత్. ఉరివేయడం, విషం తాగడం అంటూ టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్రంలో పేదలకు లక్షా 25 వేల కోట్ల రూపాయలు వివిధ…