Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్‌పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.
విజయదశమి సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్ర పూజలు చేశారు. అనంతరం సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ చేరుకోవడానికి ముందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ లో సైనికులతో ముచ్చటించారు. అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేస్తారనే భావనను ప్రశంసించారు.
Army Helicoptor Crash : అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. పైలట్ల జాడ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
US Reacted To India-China Border Clash: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు.…
ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ నివశించే ప్రజలు పనుల కోసం, ఉద్యోగాల కోసం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కాయాకష్టం చేసి జీవనాన్ని వెళ్లదీస్తుంటారు. కొంతమంది ఉన్న ఊర్లోనే ఉంటూ దొరికిన పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఇదే ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరుల్ని చేసింది. రాత్రికి రాత్రే అంటే వారికేమి నిధులు, నిక్షేపాలు దొరకలేదు. ప్రభుత్వం నుంచే వారికి భారీ…
గత కొంతకాలంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండియా చైనా బోర్డర్‌లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. బోర్డర్‌లో చైనా నిర్మాణాలను నిర్మిస్తున్నది. దీంతో ఇండియా కూడా చైనాకు ధీటుగా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నది. చైనా బోర్డర్‌లోని తవాంగ్ లోని బుద్దపార్క్‌లో పదివేల అడుగుల ఎత్తులోని పర్వతంపై 104 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పతాకాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖమంత్రి పెమా ఖండూ ప్రారంభించారు. చైనా బోర్డర్‌లోని సైనికులకు కనిపించేలా ఈ జాతీయ పతాకాన్ని…
మొన్న లద్దాక్..నేడు తవాంగ్ ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు చైనా సరిహద్దుల్లో భారీ బందోబస్త్‌ను భారత్ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో భారత్ భూటాన్, టిబెట్‌లకు ఆనుకుని ఉన్న తవాంగ్ ప్రాంతం పై చైనా కన్ను పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశపూర్వకంగా అక్కడి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనాకు ధీటుగా జవాబు చెప్పేందుకు అమెరికా తయారు చేసినా…
ఇప్పటి వరకు లద్దాఖ్‌లో అలజడులు సృష్టించిన చైనా కన్ను ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌పై పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదే అని చెప్పి ఎప్పటి నుంచే చైనా వాదిస్తూ వస్తున్నది. ఇండియా అందుకు ఒప్పుకోకపోవడంతో రెండు దేశాల మధ్య అరుణాచల్ ప్రదేశ్ వివాదం నడుస్తున్నది. ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ చైనా బోర్డర్‌లో నిత్యం బలగాలు పహారా కాస్తుంటాయి. అయితే, చైనాకు చెందిన 200 మంది జవానులు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు. తవాంగ్‌లో…