తౌక్టే తుఫాను చాలా మంది ప్రాణాలను తీసింది. కొన్ని ప్రాంతాలలో భారీ ఆస్తి నష్టం కలిగించింది. అంతేకాదు బాలీవుడ్ నిర్మాతలపై కూడా తౌక్టే తుఫాను ఎఫెక్ట్ పడింది. ముంబైలోని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఫిల్మ్ సెట్లపై తౌక్టే తుఫాను ఎఫెక్ట్ భారీగానే పడింది. ‘మైదాన్’ కోసం ఏర్పాటు చేసిన సెట్ బాగా దెబ్బతింది. అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ముంబై శివారులో ఈ ప్రత్యేక సెట్ రూపొందించబడింది. ఈ చిత్రానికి ఇలాంటి…
తౌక్టే తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను దాటికి ముంబై అతలాకుతలం అవుతుంది. రోడ్లపై భారీ చెట్లు విరిగిపడుతున్నాయి. అయితే టీవీ నటి దీపికా సింగ్ గోయల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలులకు పడిపోయింది. నేలరాలిన ఆ చెట్టు వద్ద దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. తుఫాన్‌ను ఆపలేమని, ఆ ప్రయత్నం చేయవద్దు అని, మనం ప్రశాంతంగా మారి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని తన పోస్టుకు క్యాప్షన్…
టౌటే తుఫాన్ ఈనెల 18 వ తేదీన గుజరాత్ తీరాన్ని దాటింది. తరాన్ని దాటే సమయంలో భారీ విధ్వంసం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అహ్మదాబాద్ నగరంపై టౌటే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ తుఫాన్ ధాటికి నగరం అల్లకల్లోలం అయింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురవడంతో అహ్మదాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. …
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ఇప్పుడు పెను తుఫాన్ గా మారి అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై ప్రభావం చూపించింది. ప్రస్తుతం తీవ్రమైన తుఫాన్ గా మారి గుజరాత్ వైపు పయనిస్తోంది టౌటే తుఫాన్. ఈరోజు సాయంత్రం వరకు టౌటే తుఫాన్ గుజరాత్ తీరాన్ని చేరుతుంది. దీంతో ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలను అక్కడి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎలాంటి విపత్తు…
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంటే ఇప్పుడు తౌక్టే తుఫాన్ కలకలం రేపుతోంది. అయితే తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనుంది తౌక్టే. వాతావరణ హెచ్చరికలు, కేంద్రం ఆదేశాలతో ప్రభావిత రాష్ట్రాలకు 126 మందితో కూడిన విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్ళింది. విపత్తు సమయంలో సహాయక చర్యల సామగ్రితో బయలుదేరిన బలగాలు… గన్నవరం విమానాశ్రయం నుంచి మూడు ప్రత్యేక వాయుసేన విమానాల్లో ఆయా రాష్ట్రాలకు…