బాలీవుడ్ టాప్ స్టార్స్ సెట్స్ పై తౌక్టే తుఫాను ఎఫెక్ట్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తౌక్టే తుఫాను చాలా మంది ప్రాణాలను తీసింది. కొన్ని ప్రాంతాలలో భారీ ఆస్తి నష్టం కలిగించింది. అంతేకాదు బాలీవుడ్ నిర్మాతలపై కూడా తౌక్టే తుఫాను ఎఫెక్ట్ పడింది. ముంబైలోని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఫిల్మ్ సెట్లపై తౌక్టే తుఫాను ఎఫెక్ట్ భారీగానే పడింది. ‘మైదాన్’ కోసం ఏర్పాటు చేసిన సెట్ బాగా దెబ్బతింది. అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ముంబై శివారులో ఈ ప్రత్యేక సెట్ రూపొందించబడింది. ఈ చిత్రానికి ఇలాంటి నష్టం జరగడం ఇది రెండోసారి. అంతకుముందు మే 2020లో కోవిడ్-19 లాక్డౌన్ సయమంలో వర్షాల కారణంగా ఈ సెట్ డామేజ్ కావడంతో కూల్చివేసి మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీ ‘టైగర్ 3’ కోసం సమాచారం ప్రకారం చిత్రాన్ని నిర్మిస్తున్న యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాతలు ముంబై, గోరేగావ్‌లోని SRPF గ్రౌండ్‌లో దుబాయ్‌ను ప్రతిబింబించే సెట్‌ను నిర్మించారట. ఈ సెట్ కూడా బలమైన ఈదురు గాలులు, కుండపోత వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్నది. ఇంకా అలియా భట్, రణబీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్రా’ సెట్లో కూడా స్వల్ప నష్టాలు సంభవించాయి. అయితే అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” సెట్ మాత్రం సేఫ్ గా ఉంది. ఇటీవల షీట్లతో కప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో భారీ నష్టం నుంచి బయటపడ్డారు నిర్మాతలు.
Also Read
తాజావార్తలు
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!