టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్.. తన కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. తన వాణిజ్య వాహనాల ధరలను జూలై 1 నుంచి 2 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది. ఇది మొత్తం వాణిజ్య వాహనాల శ్రేణికి వర్తిస్తుందని.. మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతాయని కంపెనీ పేర్కొంది.
మహారాష్ట్రలోని అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ స్కూల్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ ఫ్లయింగ్ స్కూల్లో ప్రతి సంవత్సరం 180 మంది పైలట్లకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. పైలట్ల కొరతను ముందే ఊహించి, ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఒక ఫ్లయింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tesla: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఎలాన్ మస్క్ ఇండియాను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ కానున్నారు.
Tata Motors: టాటా మోటార్స్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై మరింత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలపై ధరలు పెరగనున్నాయి.
శంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు తన నాల్గవ ఎలక్ట్రిక్ కారు 'టాటా పంచ్ ఈవీ'ని విడుదల చేసింది. రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు, రెండు విభిన్న డ్రైవింగ్ పవర్ట్రెయిన్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ దేశంలోనే అత్యంత సురక్షితమైన ఈవీ కారు అని కంపెనీ పేర్కొంది.
భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఒక దాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ప్రముఖ ఆటో కంపెనీ టాటా మోటార్స్ దాని ప్రముఖ కారు టాటా పంచ్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది.
Bharat NCAP: టాటా మోటార్స్ భారత్‌లో అత్యంత సేఫ్టి రేటింగ్స్ కలిగిన కార్లుగా ఉన్నాయి. టాటా నుంచి వస్తున్న టియాగో, టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు సేఫ్టీ రేటింగ్స్‌లో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. వినియోగదారుడి భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని కార్ల బిల్ట్ క్వాలిటీని స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ఇప్పటికే టాటాకి చెందిన నెక్సాన్, హారియర్, సఫారీ కార్లు గ్లోబల్ NCAP రేటింగ్స్‌లో 5-స్టార్స్ సాధించాయి.
టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్ తన తదుపరి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరి 2024 చివరి వారంలో టాటా పంచ్ ఈవీని భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిసింది.