ఓ సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు. తన భర్తపై దాడి చేసి.. తనను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారేడ్‌పల్లి సీఐపై వనస్థలిపురం పీఎస్‌లో కేసు నమోదు చేశారు.. బాధిత మహిళ భర్తపై దాడికి పాల్పడిన సీఐ.. ఆ తర్వాత నగర శివారులోని ఓ లాడ్జికి బలవంతంగా ఆ మహిళను తీసుకెళ్లాడు.. ఆపై అమెపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.. ఇక,…
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమయిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది.…
ఈమధ్యకాలంలో పబ్బులు చట్టవ్యతిరేక చర్యలకు, గబ్బు పనులకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వార్నింగ్ ఇచ్చారు. పబ్బుల్లో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. కొన్ని పబ్ ల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. పబ్ ల మీద ఫిర్యాదులు వస్తే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీపీ. పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పబ్ లు సకాలంలో మూసి వేస్తున్నారా…
హైదరాబాద్ పోలీసులు పేకాట స్థావరాలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. మంచిరేవులలో ఓ సినీనటుడి ఫాం హౌస్‌లో దాడుల తర్వాత పేకాట రాయుళ్ళ పని పడుతున్నారు. బేగంపేటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిర్వాహకుడు అరవింద్ అగర్వాల్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశామని బేగంపేట పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బేగం పేట పేకాట కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అరవింద్‌తో పాటు వ్యాపారవేత్తలు జాఫర్ హుస్సేన్, సిద్దార్థ్ అగర్వాల్, బగీరియా సూర్యకాంత్, అబ్దుల్…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా కోకైన్, చరస్ తో పాటు మరో ఆరు రకాల మత్తు పదార్థాల అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులతో పాటు వాటిని సేవిస్తున్న మరో నలుగురు యువకులను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్తయిన వారి నుంచి 3లక్షల 16వేల రూపాయల విలువగల ఒకటిన్నర గ్రాముల కొకైన్, 15 గ్రాముల చరస్, 15 ఎల్.ఎస్.డి పేవర్లు మత్తును కలిగించే ట్యాబ్లెట్లు, గంజాయి నుండి తీసిన నూనే, గంజాయి పోడిగా…