బేగంపేట పేకాట కేసు.. అరవింద్ అరెస్టుతో కదులుతున్న డొంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పోలీసులు పేకాట స్థావరాలపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. మంచిరేవులలో ఓ సినీనటుడి ఫాం హౌస్‌లో దాడుల తర్వాత పేకాట రాయుళ్ళ పని పడుతున్నారు. బేగంపేటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిర్వాహకుడు అరవింద్ అగర్వాల్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశామని బేగంపేట పోలీసులు తెలిపారు. హైదరాబాద్ బేగం పేట పేకాట కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అరవింద్‌తో పాటు వ్యాపారవేత్తలు జాఫర్ హుస్సేన్, సిద్దార్థ్ అగర్వాల్, బగీరియా సూర్యకాంత్, అబ్దుల్ అలీ జిలానీలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాటరాయుళ్ల నుంచి పోలీసులు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాటలో అరవింద్ అగర్వాల్ హైదరాబాద్‌ను శాసిస్తున్నాడు. అగర్వాల్‌కు రెండు రాష్ట్రాల్లోని ప్రముఖులతో పరిచయాలు వున్నాయి. క్యాసినో, పోకర్, పేకాట, తీన్‌పత్తాలను ఆడిస్తున్నాడు అరవింద్ అగర్వాల్. అతని కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులే వుండడం గమనార్హం. అన్ని పార్టీల రాజకీయ నాయకులతో అరవింద్ అగర్వాల్‌కు సంబంధాలు వుండడంతో కేసు పరిశోధన కష్టం అవుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా అరవింద్‌కు లింకులు వున్నాయి.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత నాదే అంటూ భరోసా ఇస్తున్నాడు అరవింద్. గోవా, సింగపూర్, శ్రీలంకలకు వీఐపీలను తీసుకెళ్తున్నాడు అరవింద్. ఇతర దేశాల్లో కోట్లు పెట్టి క్యాసినో ఆడిస్తున్నాడు అరవింద్ అగర్వాల్. పండుగలు, ముఖ్యమైన రోజుల్లో కోట్లరూపాయల పేకాట దందా సాగుతోంది. బేగంపేటలో 150మందికి ఆహ్వానం పంపిన అరవింద్..ఆహ్వానం అందుకున్నవారిలో 85మంది హాజరయ్యారు.
స్థానికుల సమాచారంతో టాస్క్‌ఫోర్స్ దాడులు చేసింది. బేగంపేట అడ్డాపై టాస్క్‌ఫోర్స్ దాడి తర్వాతే ప్రముఖ నాయకుడి రంగప్రవేశం జరిగింది. పోలీసులు చాలామందిని పట్టుకొని తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని, ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చూపడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?