ఎంత పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టలేకపోతోంది ప్రభుత్వం. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో లారీల్లో, ఇతర వాహనాల్లో ఎర్రచందనం గుట్టుచప్పుడు కాకుండా రవాణా అవుతోంది. తాజాగా భారీ స్థాయిలో ఎర్రచందనం ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్ శాండిల్ అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేశామన్నారు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ కార్తికేయ. అటవీ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్ చేశారు. 75 లక్షలు విలువైన 500 కిలోల ఎర్ర చందనం ను సీజ్ చేశాం అన్నారు.
ఈ కేసులో ఐదు మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు కడప జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్లా ఒక టీమ్ ఏర్పాటు చేసి రెడ్ శాండీల్ స్మగ్లింగ్ చేస్తున్నారు. రవి చంద్ర అనే వ్యక్తి ద్వారా తీసుకొని అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ ముఠా హైదరాబాద్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి దేశ వ్యాప్తంగా వేరే రాష్ట్రాలకు ఇది స్మగ్లింగ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ చేస్తూ వస్తున్నారు. ఎర్ర చందనం ముందుగా శాంపుల్ గా బైక్ పై తీసుకొచ్చారు.. తరువాత ముఠాను అరెస్ట్ చేసి 500 కిలోల రెడ్ శాండీల్ ను సీజ్ చేశామన్నారు కార్తికేయ.
Read Also: Analysis On Chiranjeevi Comments: జనసేనకు ‘చిరు’ మద్దతు!
గతంలో రవి చంద్ర ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నాడు. పుష్ప సినిమాను ఆదర్శంగా ఈ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నాం. తగ్గేదేలే అన్నట్టుగా ఏదో ఒక రూపంలో ఎర్రచందనం రవాణా అక్రమంగా సాగుతోంది. నిందితులపై 447, 427, 379,120- B , 109 రెడ్ విత్ 34 IPC కింద కేసులు నమోదు చేశాము. ఈ కేసులో విచారణ చేస్తున్నాం, పరారీ లో ఉన్న నిందితుడు రవి చంద్ర ను త్వరలో అరెస్ట్ చేస్తాం.
Read Also: Indrasena Reddy: బీజేపీ నేతలే టార్గెట్ గా అక్రమ కేసులు