తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 25 రోజుల వ్యవధిలో తమిళనాడులో 25 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు చెన్నై మహానగరంలోనూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె కోయంబత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆ జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కోవి నగరంలోనూ కేసులు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోయంబత్తూరు జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉండే వారి కంటే అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. ఈ జిల్లాలో కరోనా బారిన పడిన రోగుల్లో 70 శాతం మందికి ఆక్సిజన్ అవసరం అవుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ కోయంబత్తూరు జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూస్తోంది.