తమిళ రాజకీయంలో మళ్లీ గందరగోళం…శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లోకి మళ్లీ శశికళ రాబోతుందా అంటే కొంతమంది అవుననే అంటున్నారు. 2016లో ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పార్టీని తాత్కాలికంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించిన శశికళ తమిళనాడు ఎన్నికలకు ముందు బెయిల్‌పై విడుదలయ్యారు. పార్టీలో తిరిగి చేరాలన్న ఆమె కలను పలనీస్వామీ, పన్నీర్ సెల్వంలు అడ్డుకున్నారు. చిన్నమ్మ తిరిగి పార్టీలోకి రాకుండా సమర్ధవంతంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకే ఓటమిపాలైనప్పటికీ, ఆ పార్టీ మెరుగైన స్థానాల్లో విజయం సాధించింది. శశికళకు, ఆమె కుటుంబ సభ్యులు ఎవరికీ పార్టీలో స్థానం ఇవ్పకూడదని ఇప్పటీకే అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నది. అయితే, పార్టీలో ముఖ్యనేతల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని, పార్టీ కార్యకర్తలతో ఆమె టచ్‌లో ఉన్నారనీ, ఈ సమయంలో పార్టీలోకి ప్రవేశించి అన్నాడిఎంకేలో చక్రం తిప్పాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై పార్టీ డిప్యూటి కోఆర్టినేటర్ మునుస్వామి స్పందించారు. పళనీస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీని సమర్ధవంతంగా నడుపుతున్నారని, ముఖ్యనేతల మద్య ఎలాంటి అభిప్రాయ భేధాలు లేవని, శశికళను పార్టీలోకి తీసుకునే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!