ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని ఎంత హెచ్చరిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. చెన్నైలోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అయితే మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ..అందులో…
తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, తమిళనాడు సరిహద్దు కలిగిన కేరళ రాష్ట్రంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు ఆ రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read: జగన్…
మరోసారి తమిళనాడులోని శివకాశిలో పేలుడు సంభవించింది.. శివకాశికి సమీపంలోని జమీన్‌సల్వార్‌పట్టి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగాయి.. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.. ఇక, భవనం శిథిలాల కింద దాదాపు 20 మంది ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బాధితులను వెలికితీసిందుకు సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందంటున్నారు.. కాగా, తమిళనాడులోని విరుదునగర్ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున…
దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయో, ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం బిర్యానీ. ఎన్ని బిర్యానీ రెస్టారెంట్లు వచ్చినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. నోరూరించే బిర్యానీ తక్కువ ధరకు అందిస్తే ఇంకెందుకు ఊరుకుంటారు చెప్పండి. అమాంతం లాగించేస్తారు. సాధారణంగా బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తక్కువ ఆఫర్లు పెడుతుంటారు. ఇలానే తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యాపారి బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభం రోజున వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించాడు. పాతకాలం నాటి పైసలు, పైగా…
ప్రజలను ఆకర్షించడానికి ఆయా కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. ఇలా చాలా మంది ఆఫర్లు పెడుతుంటారు… దీంతో.. ప్రజలు తమ వెసులుబాటును బట్టి.. కొనుగోళ్లకు మొగ్గు చూపుతుంటారు.. ఇక, బిర్యానీపై ఆఫర్ పెడితే.. అది కూడా 5 పైసలకే ఓ బిర్యానీ అంటే వదిలిపెడతారా..? ఎగబడి మరీ బిర్యానీ తీసుకోవడానికి పోటీపడ్డారు.. ఓవైపు కరోనా మహమ్మారి భయాలో ఉన్నా.. కోవిడ్ రూల్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. బిర్యానీ దొరికితే చాలు అనే రీతిలో ఎగబడ్డారు ప్రజలు. ఐదు పైసలకే…
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో వున్నా సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో, ఎమ్మెల్యే, సిఎం కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే పార్టీ సీరియస్ అయింది. ఈ సంఘటనపై మాజీ ఎఐఎడిఎంకె మంత్రి జయకూమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో హీరో ఫోటోలా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలోని న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలు ఎలా పెడుతారు…
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఉదృతి ఇంకా కోనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రతో పాటు అటు ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఈరోజు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పన, ఆక్సిజన్ కొరత…
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులకు ఓటిటి ప్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకుంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఇందులో రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, తెలుగులో ‘ఆహా’ వంటి ఓటిటి వేదికలు ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇటీవలే కేరళ ప్రభుత్వం త్వరలో ఒక సొంత ఓటిటిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా చిన్న-బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వనుంది. ఈ వేదిక రాష్ట్రవ్యాప్తంగా చిత్రనిర్మాతలు నిర్మించే తక్కువ బడ్జెట్, ఆఫ్‌బీట్ చిత్రాలను విస్తృతంగా…
దేశం సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ప్రజాజీవనం సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ను దాదాపుగా ఎత్తివేశారు. సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం నుంచి రవాణా వ్యవస్థను పునరుద్దరించారు. తమిళనాడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తమిళనాడులోని 27 జిల్లాల్లో 19,920 బస్సలు రోడ్డెక్కాయి. దీంతో తమిళనాడులో ఒక్కరోజులో 22…