కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. మీగతా వారికి టీకా వేయించేందుకు అక్కడి సామాజిక సంస్థలు నడుం బిగించాయి. టీకా తీసుకుంటే బిర్యాని, మిక్సీ, గ్రైండర్, రెండు గ్రాముల బంగారం చొప్పున లక్కిడిప్ ద్వారా మూడు బహుమతులు, వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయ్యాక లక్కిడిప్ ద్వారా వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, స్కూటర్ బహుమానంగా ఇస్తామని సామాజిక సంస్థలు ప్రకటించడంతో మూడు రోజుల వ్వవధిలోనే దాదాపుగా 350 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మంత్రం ఫలించడంతో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలానే వ్యాక్సిన్‌ను అందించాలని చూస్తున్నది ప్రభుత్వం