నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో వున్న ప్రభుత్వాలే తిరిగి వస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారుతున్నా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వస్తున్నారు. కనుకనే ఈ అయిదు ఎన్నికలు ఒకే పాఠం ఇస్తున్నాయి. అన్నిటిలోకి అత్యంత నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ రాష్ట్రం కైవసం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. కాంగ్రెస్ వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయిన ఫలితంగా బిజెపి పెద్ద ప్రతిపక్షంగా రావడమే ఘన విజయమని ఇప్పుడు చెబుతున్నారు.వాస్తవానికి ఎన్నికలు ఎనిమిది దశల్లో జరపడంతో సహా బిజెపి శ్రుతిమించిన ఎత్తుగడలు ,హిందూత్వ కార్డును ప్రయోగించడం మోడీ రవీంద్రనాథ టాగూరు వేషాలు వేయడం,తృణమూల్ నుంచి విపరీతంగా ఫిరాయింపు ప్రోత్సహించడం ఇలాంటివన్నీ బెంగాలీలో విముఖత నిరసన పెంచాయి. మమత పాలనపై వారికి అనేక ఫిర్యాదులున్నా పక్కన పెట్టి ఆమెకే పెద్ద ఎత్తున ఓటేశారు. ఈ ద్విముఖ పోరులో కాంగ్రెస్ వామపక్షాలు కనుమరుగైపోయాయి గాని మమత మూడోసారి విజయపతాక ఎగరేశారు. నందిగ్రామ్‌లో ఆమె ఓడిపోవడం ముఖ్యమంత్రి కావడానికి ఆటంకం కాదు గాని అందులోని రాజకీయ సంకేతం విస్మరించరానిది. బిజెపికి ఇంకా చెప్పాంటే మోడీ షా ద్వయం దూకుడుకు దురహంకారానికి బెంగాల్ తిరస్కరణగానే ఈ ఫలితాలను పరిశీకులు పరిగణిస్తున్నారు.
ఎల్‌డిఎప్ యుడిఎప్ ఒకటి వంతు వారిగా గెలుస్తూవచ్చిన కేరళలో నలభై ఏండ్ల వరవడిని తిరగరాసి పినరాయి విజయన్ నాయకత్వంలో ఎల్‌డిఎఫ్‌మళ్లీ విజయం సాధించడం, తమిళనాడులో స్టాలిన్‌నాయకత్వంలోని డిఎంకె విజయభేరి మోగించడం కూడా మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడకు ఎదురుదెబ్బలాంటిదే, కేరళ దేశానికి మొదటి ప్రతిపక్ష ప్రభుత్వాన్నిఇచ్చిని రాష్ట్రం కాగా తమిళనాడు తొలి ప్రాంతీయ పార్టీగా డిఎంకెకు పట్టం కట్టిన రాష్ట్రం, అన్నాడిఎంకె పునాదితో తను పాగా వేయాని బిజెపి జయలిత అనారోగ్యం నాటి నుంచి చాలా పాచికలు వేసింది, రజనీకాంత్‌ను తేవాలని ప్రయత్నించి విపలమైంది, స్టాలిన్ ఘన విజయం సాధించగా అన్నాడిఎంకె కూడా గౌరవ ప్రదంగాబయిటపడటం,దాని సాయంతో బిజెపి నాలుగు స్థానాలకు పరిమితం కావడం అంచనాకు తగినట్టే వుంది. విజయన్ స్టాలిన్ ఇద్దరూ మోడీవిధానాలపై తీవ్ర విమర్శకులే. కేరళలో విజయన్ ప్రభుత్వం రెండు సార్లు వరదనూ నిప్పో కోవిడ్ వైరస్‌ను తట్టుకుని ప్రజలను ఆదుకోవడంలో జయప్రదమైన తీరు ప్రపంచ ప్రశంసలు పొందింది, అలాంటి చోట శబరిమలై సమస్యను ఇంకా బంగారం స్మగ్గింగ్ వంటి లేనిపోని ఆరోపణను తెచ్చి కేంద్రం అధికారం సహాయంతో ప్రయోజనం పొందాలని బిజపి చేయని ప్రయత్నం లేదు.మరోవంక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సర్వశక్తులు సమయమూ సిపిఎంను ఓడిరచడానికే వెచ్చించి అస్సాంను కూడా ఉపేక్షించారు. ఈ రెండు దాడులను తట్టుకుని ప్రకృతి వైపరీత్యాలను కోవిడ్‌ను కూడా అధిగమించిన విజయన్‌ను ఎల్‌డిఎప్‌ను కేరళ ఆశీర్వదించింది. బెంగాల్ ఫలితాలో వామపక్షం పూర్తిగా మాయమైన సమయంలో అసాధారణంగా విజయం సాధించి ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాదిని కాపాడినది, ఈ రెండు చోట్ల ఫలితాలతో దక్షిణాదిన బిజెపి విజయం సాధించడం దుస్సాధ్యమని తేలింది. ఇదే సమయంలో ఏపీ తెలంగాణ ఉప ఎన్నికలో బిజెపి డిపాజిట్లు కోల్పోయింది కూడా. ఒక్క పాండిచ్చేరిలో మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్త పాత ఫిరాయింపు దార్ల కూటమిలో భాగం సంపాదించి సంతృప్తిపడాల్సిన పరిస్థితి,
అస్సాంలో బిజెపి ఎన్‌డిఎ అధికారం నిబెట్టుకున్నా కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యామ్నాయ కూటమి కూడా గట్టిపోటీనే ఇచ్చింది. బెంగాల్‌లో బెడిసి కొట్టిన హిందూజాతీయ వాద వ్యూహం సిఎఎ విదేశీ చొరబాట్లు మత పరమైన ఉద్వేగాల వ్యూహం అస్సాంలో అక్కరకు వచ్చింది, అయితే అక్కడ కూడా ఎజిపితో కలిసి మాత్రమే విజయం సాధ్యమైందిన గుర్తుంచుకోవాలి.మిగిలినరాష్ట్రాలో వలె అస్సాంలో బిజెపిని ఎదుర్కోవడానికి బలమైన ప్రాంతీయ పార్టీగాని నాయకులు గానిలేకపోవడం, కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు,ఎఐఎంఎల్ నాయకుడైన పరిమళవ్యాపారి అజ్మాల్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాన్న ప్రచారం కూడా పనిచేశాయి, ఇవన్నీ కలిసి అస్సాంను బిజెపి ఖాతాలో నిబెట్టాయి గాని మోడీ మ్యాజిక్ అని చెప్పడానికి లేదు.
మొత్తంపైన బిజెపి కేంద్రంలో పాలిస్తున్నా రాష్ట్రాలకు వచ్చేసరికి అంత స్థాయిలో ప్రభావం చూపలేకపోత్నునదని ఈ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది, పార్లమెంటులో 303 స్థానాలు లేదా యాభై అయిదు శాతం పొందిన బిజెపి రాష్ట్రాలోని 4 వేల పై చిలుకు అసెంబ్లీ స్థానాలలోనూ కేవం 1400 లేదా ముపై శాతం కూడా దాటలేకపోతున్నది, అత్యధిక స్థానాలున్న శాసనసభల్లో మహారాష్ట్ర కోల్పోయాక కేవలం యుపిలో మాత్రమే ఆ పార్టీ పాలన చేస్తున్నది, తమిళనాడు పశ్చిమబెంగాల్‌లో ప్రాంతీయ పార్టీలే పాలిస్తున్నాయి. 31 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన ఈ దేశం వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని గౌరవించకుండా ఒకేదేశం ఒకే మతం ఒకే పార్టీ ఒకే పన్ను ఒకే ఎన్నిక ఒకే మోడీ అనే తరహాలో ఆలోచిస్తున్న బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రాలకు కోవిడ్ సహాయంలోనూ విమర్శనెదుర్కొంది. ఎపి తెలంగాణతో సహా రాష్ట్రాల కోర్కెల పట్ల ఇచ్చిన వాగ్దానాల పట్ల ఉపేక్ష ప్రదర్శించింది, స్థానిక బిజెపి నేతలు కూడా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తామని తామే నిధులు ఇస్తున్నామని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సిబిఐ ఇడి ఎన్‌ఐఎ వంటివాటిని ప్రత్యర్థిపార్టీపై ప్రయోగిస్తున్నారు. ఇవి ప్రజలు ఆమోదించడం లేదు గనకనే రాష్ట్రాల ఎన్నికలో బిజెపిని తిరస్కరిస్తున్నారు. ఈశాన్యాన చిన్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్ హిమచల్ ప్రదేశ్ వంటివి మినహాయిస్తే యుపి గుజరాత్ మాత్రమే బిజెపి గెవగలిగింది, మద్యప్రదేశ్ కర్ణాటక ఫిరాయింపు తర్వాత తెచ్చుకుంది. బీహార్ హర్యానా అస్సాం త్రిపుర వంటివి ప్రాంతీయ పార్టీ తోడ్పాటుతో గాని పాలించలేని పరిస్థితి, అఖిలభారతం తమ అధీనంలోకి వచ్చేసిందని అశ్వమేధయాగం తర్వాత రాజసూయమే మిగిలిందని అనుకున్నది కాస్తా ప్రతి రాష్ట్రం బిజెపికి సవాలుగానే మారుతున్నది, అయిదు రాష్ట్రాల ఫలితాల తర్వాత బిజెపి ఏకపక్షపోకడకు,మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక పెంచే అవకాశం మరింత పెరుగుతుంది.రైతాంగ ఉద్యమం, ప్రైవేటీకరణ ఆర్థిక క్షీణత,నిరుద్యోగం.అధిక ధరలు వంటి సమస్యు కూడా సవాళ్లుగా ముందుకు రావచ్చు.,కోవిడ్‌పై పోరులో వైఫ్యల్యం, తగ్గని సెకండ్ వేవ్ మరింత తక్షణ సమస్యవుతాయి.