Tamilnadu Crime Scene: తమిళనాడులోని ఈరోడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి కన్న కూతురు పిండాన్ని కన్నతల్లి అమ్ముకుంటున్న ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలిక నుంచి లెక్కకు మించిన సార్లు పిండం విక్రయించిన ముఠాను అరెస్ట్ చేయగా తల్లి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి, పెంపుడు తండ్రి సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోడ్‌లోని రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు.
Read Also: Tree Cut in Kerala: రోడ్డు విస్తరణ కోసం అధికారుల అమానుష చర్య.. విలవిలలాడిన పక్షులు..!!
ఈరోడ్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక వయస్సును 22 ఏళ్ళుగా ఆధార్‌కార్డులో మార్పుచేసి బాలిక పిండాన్ని చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. తనకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి పిండాన్ని ఇస్తున్నట్లు బాలిక వాంగ్మూలం ఇచ్చింది. ఒక్కో పిండాన్ని రూ.25వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక పిండాన్ని తమిళనాడులో మాత్రమే కాకుండా తిరువనంతపురానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రికి, ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో ఉన్న ఓ ఆస్పత్రికి ముఠా విక్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలిక నుంచి మూడేళ్లు పిండం సేకరించిన వ్యవహారంలో కేరళ, ఏపీలోని తిరుపతిలోని ఆస్పత్రులపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అటు తనపై లైంగిక దాడి తట్టుకోలేక బాధితురాలు ఇంటి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది.