Smuggling : కలకత్తా అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కరెన్సీ విలువ దాదాపు 33లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.
KE Kumar: తమిళనాడులో జరుగుతున్న జాతీయ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్‌లో విషాదం చోటు చేసుకొంది. వెటరన్ రేసర్ కేఈ కుమార్ (59) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. రెండో రౌండ్ పోటీల్లో భాగంగా మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కేఈ కుమార్ కారు మరో పోటీదారుడి వాహనాన్ని ఢీకొట్టి ట్రాక్ నుంచి పక్కకు వెళ్లి బోల్తా పడింది. వెంటనే రేసును నిలిపివేసిన నిర్వాహకులు కారులో నుంచి కేఈ కుమార్‌ను బయటకు…
రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది.
Omicron BF7 : కరోనాకు పుట్టినిల్లు చైనాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కమ్యూనిటీ వ్యాప్తి కొనసాగుతుండడంతో ప్రభుత్వం పరిస్థితిని కూడా అంచనా వేయలేని విధంగా తయారైంది.
ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయంలో పనిచేసే ఓ పనిమనిషిని బలవంతంగా ముద్దుపెట్టాడు ఓ ఉన్నతాధికారి. గదిని శుభ్రం చేయడానికి వచ్చిన పనిమనిషిని కౌగిలించుకుని ముద్దు పెట్టాడని ఆ పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటైన ఆర్మగస్వామి కమిషన్ తన నివేదినకను ఈ ఏడాది ఆగస్టు 25న సీఎం స్టాలిన్‌కు సమర్పించిన సంగతి విదితమే. కానీ జయలలిత మరణం ఇప్పటికి మిస్టరీనే. తాజాగా దివంగత సీఎం మరణంపై ఆమెకు ఆప్తమిత్రురాలైన వీకే శశికళ కీలక వ్యాఖ్య చేశారు.
మాండూస్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను త్వరలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.