Chennai Techie: రోడ్లపై గుంతలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో చాలా మంది కిందపడి లేదా ఇతర వాహనాలను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మంగళవారం చెన్నైలో 22 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ యువతి రోడ్డుపై గుంతను తప్పించుకునే క్రమంలో ట్రక్కును ఢీకొట్టింది. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ద్విచక్రవాహనంపై ఉన్న యువతి సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితురాలు శోభన జోహో అనే ప్రైవేట్ టెక్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది. శోభన తన సోదరుడిని అతని నీట్ కోచింగ్ క్లాసుల కోసం ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో డ్రాప్ చేయడానికి వెళుతున్నట్లు సమాచారం. సోదరుడు కూడా ప్రమాదంలో గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శోభన, అతని సోదరుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Rare Surgery: అరుదైన శస్త్రచికిత్స విజయవంతం.. తెగిపోయిన మర్మాంగాన్ని అతికించారు..!
“వారెవరూ హెల్మెట్ ధరించలేదు. ట్రక్ డ్రైవర్ మోహన్‌ను ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై అరెస్టు చేశాం. సివిక్ అధికారులు రహదారి దెబ్బతిన్న భాగాలను మరమ్మతులు చేశారు” అని పూనమల్లి పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేసారు. శోభన మరణానికి రోడ్లు అధ్వాన్నంగా ఉండడమే కారణమని ఆయన ఆరోపించారు. శోభన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు.