VK Sasikala: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణకు ఏర్పాటైన ఆర్మగస్వామి కమిషన్ తన నివేదినకను ఈ ఏడాది ఆగస్టు 25న సీఎం స్టాలిన్‌కు సమర్పించిన సంగతి విదితమే. కానీ జయలలిత మరణం ఇప్పటికి మిస్టరీనే. తాజాగా దివంగత సీఎం మరణంపై ఆమెకు ఆప్తమిత్రురాలైన వీకే శశికళ కీలక వ్యాఖ్య చేశారు. మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత చెన్నైలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని భావించి వైద్యం కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని దివంగత మాజీ సీఎం సన్నిహితురాలు వీకే శశికళ శుక్రవారం పేర్కొన్నారు.
2016లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జయలలిత మరణించిన ఘటనలో దాచడానికి ఏమీ లేదని శశికళ స్పష్టం చేశారు. ఆమెకు హాజరైన విదేశీ వైద్యులు ఆమెను చికిత్స కోసం విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించారని చెప్పారు. కానీ ఆమె నిరాకరించిందని, చెన్నై మెడికల్ హబ్ అని.. నగరంలో అన్ని మెడికేర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పట్టుబట్టారు. తాము ఆమెను విదేశాలకు తీసుకెళ్లాలని అనుకున్నప్పటికీ, చెన్నైలో చికిత్సను ఎంచుకోవడం పూర్తిగా ఆమె నిర్ణయమని ఆమె చెప్పారు.
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు రిజర్వ్
జయలలిత మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి ఆర్ముగస్వామి అధ్యక్షతన ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింంది. ఆ కమిటీ ఆగస్టు 25న నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఆర్ముగస్వామి పలు విషయాలను వెల్లడించాడు. జయలలిత మరణంపై విచారణ చేపట్టాలని మాజీ జడ్జి ఆర్ముగస్వామి అభిప్రాయపడ్డారు. జయలలిత ఏ రోజున, ఎన్ని గంటలకు మరణించిందనే విషయాన్ని కూడా తెలిపారు. అయితే జయ మరణంపై అపోల్ హాస్పిటల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సరిగా లేదని పేర్కోన్నారు. అపోలో నివేదిక ప్రకారం.. 2016 డిసెంబర్ 5 తేదీ రాత్రి 11.30 నిమిషాలకు జయ లలిత తుది శ్వాస విడిచారు. వార్త కథనాలు, ఆస్పత్రి నివేదికల్లో తేడాలు ఉండటంతో వివాదం చెలరేగుతోంది. జయ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.