Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై నేడు ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం.
Telangana Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి (సెప్టెంబర్ 17)వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను రాజ్‌భవన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుండగా, గవర్నర్ రాజ్‌భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. దీంతో.. ఈ విమోచన దినోత్సవం సందర్భంగా ఉద్యమం పోరాటాలు.. త్యాగాలు అనే అంశంపై విశ్వ విద్యాలయ విద్యార్థులతో వక్తృత్వ…
హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌లో పంచముఖ మహాలక్ష్మి గణపతి కొలువుదీరాడు. గణపతి ప్రతిష్టాపన పూజ ఉదయం 5గంటల నుంచి ప్రారంభమయ్యింది. ఉదయం 6గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో 60 అడుగుల గాయత్రి, నూలు కండువా, గరికమాలతో రాజ్‌దూత్ చౌరస్తా మీదుగా గుర్రపుబగ్గీలో తెలంగాణ సంస్కృతి కళారూపాలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వినాయక ఊరేగింపులో ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి కైరంకొండ సంతోష్ నేత ప్రారంభించి, ఉదయం 7గంటలకు స్వామి వారికి జంజంను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇటీవలె వరద బాధితుల్ని పరామర్శించారు ఆమె. ఆదివాసీ మహిళ అత్యున్నత పీఠం అధిరోహించడం చారిత్రాత్మకం అంటూ ప్రసంశించారు. నామినేషన్ రోజు వరదల కారణంగా ఢిల్లీ వెళ్లలేకపోయా అంటూ తెలిపారు. వరదలు వచ్చాయి కాబట్టే ప్రభావిత ప్రాంతాల్లో తిరగానని అన్నారు. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలిని కాబట్టే ప్రజల దగ్గరికి వెళ్లానని అన్నారు. అందుకే ఆదివాసీలు ఉన్న భద్రాచలం ఏరియాకు వెళ్లా అంటూ గవర్నర్ తెలిపారు. వర్షాలపై కేంద్ర హోంశాఖకు…
తెలంగాణ రాజ్ భవన్ లో బోనాల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాజ్‌భవన్ లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈనేథ్యంలో.. బోనాల పండుగలోభాగంగా.. గవర్నర్ తమిళసై అమ్మవారికి కోసం స్వయంగా బోనమెత్తారు. గవర్నర్ తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్‌లో పండుగలో పాల్గొన్నారు. రాజ్ భవన్‌లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళసై బోనాల పండుగను…
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నూతన చీఫ్ సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ నెల (జూన్) 28వ తేదీన పరమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజ్‌భవన్‌లో ఉజ్జల్ భుయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా.. నూతన సిజే ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్‌భవన్ వర్గాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే సీఎం కేసీఆర్ సమాధానం పై సీఎంవో మౌనంగా వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి…
జూబ్లీ హిల్స్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ ఘటన పై ఆరా తీశారు. పూర్తి నివేదికను అందజేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. బాలిక అత్యాచార ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై రెండురోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. జూబ్లీహిల్స్ రోడ్ లోని అమ్నీషియా…
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబైంది. ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. గవర్నర్ తమిళిసై…
రాజ్ భవన్ పాఠశాల మ్యాగజైన్‌ను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు రూపొందించిన సాహిత్య, కళాకృతుల సంకలనాన్ని ఆలకించారు. మ్యాగజైన్ లో రాజ్ భవన్ పాఠశాల 2017 నుండి 2022 వరకు సాధించిన విజయాల ప్రస్తావన వుంటుందని గవర్నర్ తమిళి సై తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి మ్యాగజైన్స్ ఉపయోగపడుతాయని అన్నారు. నేను కూడా చాలా ఆర్టికల్స్ రాశానని పేర్కొన్నారు. రోటీన్ గా చదవడం, రాయడమే కాకుండా స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాల…
విశాఖ జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం ఆలయంలో స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు తమిళిసై. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం లభించడం మహాభాగ్యం అన్నారు తమిళిసై. తొలిసారి చందనోత్సవంలో పాల్గొన్నాను. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి పవర్ ఫుల్ గాడ్, ఆలయంలో అడుగు పెడితేనే వైబ్రేషన్స్ ఉన్నాయ్ అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై.కొండపై స్వామివారి చందనోత్సవంకు క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. సాయంత్రం వరకు…