MLC Kaushik Reddy: గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది.
దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థ భ్రష్టుపట్టిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గవర్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.. ఎవరైనా గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 7 బిల్లులు ఆపారు గవర్నర్ అంటూ ఆరోపించారు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు.
నర్సంపేటలో వైఎస్‌ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. వాగ్వాదాల మధ్య చివరికి షర్మిలను తను కారులో ఉండగానే పోలీసులు క్రేన్ సహాయంతో పోలీస్టేషన్ కు తరలించారు.