Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై నేడు ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ తమిళి సై హోంమంత్రి అమిత్ షాకు వివరించనున్నారని తెలిసింది. ఈ నెల 12న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై కూడా తమిళి సై చర్చించనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలపై… ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ సంఘటనపై ముగ్గురు అరెస్టయ్యారు. ఢిల్లీ పెద్దల పేర్లు కూడా ఇందులో వినిపించాయి. ప్రధానంగా దీనిపై ఇరువురి మధ్య చర్చ జరగనున్నట్లు వినవస్తోంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా ఆమె అమిత్ షాకు తెలియజేయనున్నారని విశ్వసనీయ సమాచారం. కాగా, గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది