ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం విశాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో, లైకా సంస్థకు విశాల్ చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని మద్రాసు…
Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.సి. సబేశన్(68) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అలాగే నటుడు భూపతి(70) కూడా గురువారం కన్నుమూశారు. భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. భూపతి ఎవరో కాదు ప్రముఖ నటి, దివంగత మనోరమ కొడుకు. భూపతి తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భూపతికి ధనలక్ష్మి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. రేపు…
Pradeep Ranganathan : కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. వరుస హిట్లతో ఆయన ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే లవ్ టుడ్ సినిమాతో యూత్ ను కట్టి పడేశాడు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. దీని తర్వాత డ్రాగన్ సినిమా తీశాడు. ఆ మూవీ కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అది ఏకంగా రూ.150 కోట్లకు…
Drugs Case : తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా కలకలం రేగింది. నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పుడు మరో నటుడు కృష్ణ కూడా అరెస్టు అయ్యాడు. కృష్ణ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది. నుంగంబాకం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న తమిళ యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లూ డ్రగ్స్ ఏమైనా…
Vijay Anthony : నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగుతోంది. అతనికి తమిళ ఇండస్ట్రీలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన వద్ద కోలీవుడ్ స్టార్లు డ్రగ్స్ కొన్నారనే ఆరోపణలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఇలాంటి టైమ్ లో హీరో విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. శ్రీకాంత్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం…
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు రాబడుతోంది. నిజానికి, ఈ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళంలో సూపర్ స్టార్‌గా ఉన్న ధనుష్ హీరోగా నటించడంతో ఇక్కడ బాగా ఆడుతున్న ఈ సినిమా తమిళంలో కూడా మంచి బూస్ట్ వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే, తమిళనాడులో మాత్రం ప్రేక్షకులు చేతులెత్తేశారు. అలా అని సినిమా బాలేదా అంటే, అదేమీ కాదు. విమర్శకుల నుండి ప్రేక్షకుల వరకు సినిమా బాగుందని అంటున్నారు.…