Kollywood : కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.సి. సబేశన్(68) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. అలాగే నటుడు భూపతి(70) కూడా గురువారం కన్నుమూశారు. భూపతి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్టు తెలుస్తోంది. భూపతి ఎవరో కాదు ప్రముఖ నటి, దివంగత మనోరమ కొడుకు. భూపతి తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భూపతికి ధనలక్ష్మి, కొడుకు, ఇద్దరు కుమార్తెలున్నారు. రేపు చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.
Read Also : Dude : రూ.100 కోట్ల క్లబ్ లో డ్యూడ్.. హ్యాట్రిక్ అందుకున్న ప్రదీప్
ఇక మ్యూజిక్ డైరెక్టర్ సబేషన్ ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి ఊపేశాడు. 2017 దాకా దాదాపు 16 ఏళ్లు అలుపన్నది లేకుండా మ్యూజిక్ అందించాడు సబేషన్. సబేశన్ కుమారుడు కార్తీక్ సబేశన్, మేనల్లుడు జై ఇద్దరూ నటులుగా రాణిస్తున్నారు. ఇక సబేషన్ అంత్యక్రియలు కూడా శుక్రవారమే చెన్నైలో నిర్వహించబోతున్నారు. సబేషన్, భూపతి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ లో ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also : Janhvi Kapoor : రామ్ చరణ్, ఎన్టీఆర్ మీదనే జాన్వీకపూర్ ఆశలు..