Vijay Anthony : నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగుతోంది. అతనికి తమిళ ఇండస్ట్రీలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన వద్ద కోలీవుడ్ స్టార్లు డ్రగ్స్ కొన్నారనే ఆరోపణలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఇలాంటి టైమ్ లో హీరో విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. శ్రీకాంత్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఇదేం కొత్త కాదని తెలిపారు.
Read Also : Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
‘గతంలోనూ డ్రగ్స్ వాడారు.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది. శ్రీకాంత్ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. అప్పుడు అసలు విషయాలు అందరికీ తెలుస్తాయి. నేను ఎప్పుడూ వాటికి వ్యతిరేకమే. అందుకే వాటిని ఎంకరేజ్ చేయను. రాజకీయాల్లోకి వస్తానంటూ కొంత మంది నాపై ప్రచారం చేస్తున్నారు.
కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి వెళ్లలేను కదా. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం కామన్. కానీ ప్రజల మద్దతు ఉంటేనే అధికారం దక్కుతుంది. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు’ అంటూ తెలిపాడు విజయ్ ఆంటోనీ.
Read Also : Kannappa : ట్రోల్స్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. కన్నప్ప టీమ్ వార్నింగ్..!