Honour killing: తమిళ నటుడు-దర్శకుడు రంజిత్ "పరువు హత్యల"పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా జరిగే పరవు హత్యల్ని హింసగా చూడలేమని అన్నారు. రంజిత్ ఇలా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో తాను ఇటీవల దర్శకత్వం వహించిన ‘కవుందంపాళయం’ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.