అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీకి ఆఫ్ఘన్ రక్షణశాఖ.. తాలిబన్ సంచలన నిర్ణయం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు అక్రమించుకొని పదిరోజులైంది. అధికార బదలాంపు ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ ను నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పేరు ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన రక్షణ, ఆర్ధిక శాఖలను తాలిబన్లకు నమ్మకమైన వ్యక్తులకు అప్పటించబోతున్నారని సమాచారం. గతంలో అమెరికాలోని గ్వాంటెనామో బే జైల్లో ఖైదీగా శిక్షను అనుభవించిన ముల్లా అబ్దుల్ ఖయ్యుం జకీర్‌కు అప్పగించబోతున్నారని సమాచారం. 2001లో అమెరికా దళాలు తాలిబన్లపై దాడి చేసిన సమయంలో ఖయ్యుం జకీర్ లొంగిపోయారు. ఆయన్ను ఖైదీగా గ్వాంటెనామో బే జైల్లో ఉంచారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన జైలుగా గ్వాంటెనామో బే జైలుకు పేరున్నది. అక్కడ కరడుగట్టిన ఖైదీలను ఉంచుతారు. ఆ జైల్లో జకీర్ ఏడేళ్లు ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన్ను ఆఫ్ఘన్‌లోని పౌల్ ఇ చర్ఖీ జైలుకు తరలించారు. అయితే, ఒత్తిళ్ల కారణంగా ఆయన్ను 2008 లో ఆఫ్ఘన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తరువాత జకీర్ తాలిబన్లతో కలిసిపోయారు. హెల్మాండ్, నిమ్రూజ్ ప్రావిన్స్‌లోని దళాలకు ఆయన నాయకత్వం వహించారు. ప్రస్తుతం తాలిబన్ల కీలక నేతల్లో ఆయన కూడా ఒకరు.
Read: వ్యాక్సిన్ తీసుకోకుంటే జీతం కట్… ఎయిర్‌లైన్స్ సంస్థ కీలక ప్రకటన…
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!