ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. ఆగస్టు 15 న తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అయితే, తాలిబన్లు కాబూల్ నగరంలోకి అడుగుపెట్టకముందే అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని వదలి వెళ్లిపోయాడు. ఘనీ దేశాన్ని విడిచి వెళ్తూ కోట్లాది రూపాయలను, ఖరీదైన కార్లను తన వెంట తీసుకెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ఘనీ ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, కనీసం చెప్పులు తొడుక్కునే సమయం కూడా లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఘనీ…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల దురాక్రమణలో ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయింది. 2001 నుంచి 2021 వరకు ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశం అయింది. దీంతో ఇప్పుడు మరలా తాలిబన్ల గురించి ప్రపంచం భయపడుతున్నది. ఆందోళన చెందుతున్నది. 1990లో తాలిబన్ల వ్యవస్థ ఏర్పాటైంది. గిరిజనుల హక్కుల పోరాటం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తాలిబన్ల వ్యవస్థను 1990లో ఏర్పాటు…
టైటానిక్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లేదు. హీలీవుడ్ నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇక, ఆ సినిమా హీరో డికాప్రియో బీటిల్ కట్ హెయిర్ స్టైల్ అప్పట్లో యమా ఫేమస్ అయింది. టైటానిక్ సినిమా వచ్చిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన అమలులో ఉన్నది. అప్పట్లో ఆ హెయిర్‌స్టైల్‌ను యువత బాగా లైక్ చేసింది. చాలా మంది యూత్ ఆ హెయిర్‌స్టైల్ చేయించుకోవడానికి బార్బర్ షాపులకు క్యూలు కట్టారు. అయితే, తాలిబన్ల పాలనలో షరియా చట్టాల…
తాలిబన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆగస్టు 15 వ తేదీన వారు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇది జరిగిన రెండ్రోజులకు తాలిబన్ కీలక నేతను టోలో న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ న్యూస్ యాంకర్ బెహెస్తా ఆర్ఘాండ్ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. కాబూల్‌లో సోదాలు, భవిష్యత్ ప్రణాళికలు, మహిళలకు రక్షణ తదితర విషయాలపై ఆమె తాలిబన్ నేతను ప్రశ్నించింది. ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యి ప్రసారం జరిగాక ఆ…
తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 తరువాత కాబూల్ ఎయిర్‌పోర్ట్ తో సహా అన్ని తాలిబన్ల వశం కాబోతున్నాయి. ఆ తరువాత ఆ దేశం పరిస్థితి ఎలా మారిపోతుంది అన్నది అందిరిలోనూ ఉన్న ప్రశ్న. తాలిబన్లను చూసి భయపడవద్దని, తాము మారిపోయామని, తాము అందరిని సమానంగా గౌరవిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ ఎవరూ నమ్మడంలేదు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న క్లిప్ వైరల్ అవుతున్నది. తాలిబన్ ముష్కరులు ఓ టీవీ ఛానల్‌లోకి ప్రవేశించి,…
ఓ వైపు అమెరికా తరలింపు ప్రక్రియ తుది దశకు చేరింది. 31 తరువాత అమెరికా లేని ఆఫ్గానిస్తాన్‌ని ప్రపంచం చూస్తుంది. కానీ ఆఫ్గన్ ప్రజలకు మాత్రం మళ్లీ నరకం మొదలవుతుంది. మళ్లీ అంతర్యుద్ధంతో అట్టుడుకుతుంది. ఉగ్రతండాలు ఊళ్లకు ఊళ్లను కభళిస్తాయి. అందుకే ఇప్పుడే ఎలాగైనా బయటపడాలనుకుంటున్నారు ఆఫ్ఘన్ ప్రజలు. అందుకోసం దారులు వెతుకుతున్నారు. చావటానికైనా సిద్ధమే కానీ నరకూపం లాంటి చోట ఉండలేమని సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు. నరకకూపం లాంటి ఆఫ్గనిస్తాన్‌లో ఉండటానికి అక్కడి ప్రజలు…
ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియదు… ఎక్కడ ఏ ఆత్మాహుతి దాడికి తెగబడతారో తెలియదు..దేశమంతా హైటెన్షన్….. భయం గుప్పిట్లో ఆఫ్గన్ ప్రజలు మరి కొన్ని గంటల్లో ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగాలి. ఆగస్టు 31 నాటికి ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దాని మిత్రదేశాలకు చెందిన సైనికులంతా వెళ్లిపోవాలి. ఇది అమెరికా-తాలిబాన్ల మధ్య డీల్. సో డెడ్‌లైన్ దగ్గరవుతోంది. ఇంకో 24 గంటలే ఉంది. అమెరికా తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా…
తాలిబన్లు విధించిన డెడ్‌లైన్ మరో 48 గంటల్లో ముగియనున్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉన్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి తరువాత తాలిబన్లు కాబూల్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆగస్టు 31 తరువాత కూడా తరలింపుకు అవకాశం ఇవ్వాలని అమెరికాతో సహా ఇతర దేశాలు తాలిబన్లను విజ్ఞప్తి చేసిప్పటికీ వారు…
మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్‌పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి.…