ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను ఆమెరికా పూర్తిగా ఖాళీచేసి వెళ్లిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా ఖాళీచేసింది. చివరి సైనికుడితో అంతా ఎయిర్‌పోర్ట్‌ను వదలి వెళ్లిపోయారు. అనంతరం తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనంలోకి తీసుకున్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ కేరింతలు కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. తాలిబన్ నేతలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారు. ఎయిర్‌పోర్ట్ మొత్తం కలియదిరిగారు. దేశంలోని ప్రజలందరినీ క్షమించేశామని, పౌరులను భద్రంగా చూసుకుంటామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆఫ్ఘన్ అభివృద్దికి బాటలు వేస్తామని తెలిపారు. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు మరోమారు పేర్కొన్నారు. అయితే, తాలిబన్లపై ఉన్న భయంతో ఇప్పటికే దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఆఫ్ఘనిస్తాన్‌ను వదలి వెళ్లిపోయారు.