ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరుఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కీలక ప్రకటన చేశాడు. తాను టీ20 ప్రపంచకప్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై స్పందించాడు. తిరిగి మళ్లీ వెస్టిండీస్ జట్టులోకి రాలేనని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు. రీఎంట్రీకి తలుపులు మూసుకుపోయాయని అన్నాడు. ఈ విషయమై నరైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశాడు.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఏప్రిల్ చివరి వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి మే 1 వరకు ఐసీసీ (ICC) గడువు ఇచ్చింది. దీంతో ఆలోపే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కాగా.. ఐపీఎల్ స్టార్లపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు టాక్. ఈ టోర్నీలో రాణించిన ఒకరిద్దరికి జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.…
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం జాతీయ సెలక్షన్ కమిటీని తొలగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో.. కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం లాహోర్‌లోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, మాజీ చీఫ్ సెలెక్టర్ వాహబ్ రియాజ్ మధ్య జరిగిన సమావేశం అనంతరం పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీ-20 ప్రపంచకప్‌లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జే షా బుధవారం తెలిపారు.
జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో టీమిండియాకు పెద్ద ముప్పుగా మారే జట్టును భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. 2024 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల కంటే అఫ్గానిస్థాన్ నుంచి టీమిండియాకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని అన్నాడు. కాగా.. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా టైటిల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోందని, అందుకే టీ20…
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్నాయి. అందుకు సంబంధించి.. ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు స్థానాన్ని దక్కించుకున్నాయి.
ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ICC T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్‌లలో జరుగనున్నాయి. తొలిసారిగా అమెరికా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తోంది.
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకూ ఒకప్పుడు ఎంఎస్ ధోనితో విభేదాలు ఉన్నాయంటూ తెలిపాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడిగా ఉన్నాడు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తన చర్యతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు.